నీట్ 2026 పేపర్ లీక్?.. రాజస్థాన్‌లో కలకలం
- నీట్ 2026 పరీక్షలో అక్రమాలపై తీవ్ర ఆరోపణలు
- అసలు ప్రశ్నపత్రంతో గెస్ పేపర్‌కు పోలికలున్నట్లు గుర్తింపు
- రాజస్థాన్‌లో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్
- పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
- విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపిన ఎన్టీఏ
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ-2026లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. పరీక్షకు ఒకరోజు ముందే సర్క్యులేట్ అయిన 'గెస్ పేపర్'లోని ప్రశ్నలు, అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో దాదాపుగా సరిపోలడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘటనపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రారంభించింది.
రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మే 3న నీట్ పరీక్ష జరగగా, మే 2 రాత్రే ప్రశ్నపత్రం లీక్ అయిందని కొందరు విద్యార్థులు స్థానిక ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో 100కు పైగా ప్రశ్నలు అసలు పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాజస్థాన్ డీజీపీ ఆదేశాలతో ఎస్‌వోజీ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) బృందాలు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి.
ఈ ఆరోపణలపై జాతీయ పరీక్షల మండలి (NTA) స్పందించింది. మే 7న తమకు ఈ విషయంపై సమాచారం అందిందని, వెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేశామని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో సుమారు 8 నుంచి 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు, పూర్తి భద్రతా ప్రమాణాలతోనే పరీక్ష నిర్వహించామని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది.